తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం - minister errabelli dayakar rao campaign

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్న పేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

minister errabelli dayakar rao campaign in wardannapet
వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

By

Published : Jan 20, 2020, 4:30 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు.
వర్ధన్నపేటను మొదటి నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెరాసనేనని మరింత అభివృద్ధి కోసం మున్సిపల్​ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని మంత్రి కోరారు. అభివృద్ధిని చూసి మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 12 స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే వర్ధన్నపేటలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని... ఇతర పార్టీలను నమ్మి మోసపోతే ఈ ప్రాంతం వెనక పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.

వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details