ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో ఆయన సతీమణి స్థానిక నాయకులతో కలసి నివాళులు అర్పించారు. తెలంగాణ సమాజానికి జయశంకర్ చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
'ఆయన సూచనలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు' - ప్రొపెసర్ జయశంకర్ వర్ధంతితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలను నెమరువేసుకున్నారు.
ఆయన సలహాలు, సూచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు: ఎర్రబెల్లి
జయశంకర్ సర్... తెలంగాణ సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరకాలకు మార్గదర్శకాలయ్యాయని పేర్కొన్నారు. జయశంకర్ సర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, శ్వాసగా జీవించారని మంత్రి కొనియాడారు.
ఇదీ చూడండి: 'యోగాతో మానసిక ఒత్తడిని అధిగమించవచ్చు'