వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీటి పారుదల శాఖ పనులకు అనుసంధానం చేశారు. దేవాదుల పంట కాలువల నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఉపాధి హామీ పథకాన్ని నీటి పారుదల శాఖకు అనుసంధానం - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల శాఖ పనులకు అనుసంధానం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఉపాధి హామీ పథకాన్ని నీటి పారుదల శాఖకు అనుసంధానం
మిషన్ భగీరథ మంచినీటి ట్యాంక్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అలాగే సంగెం మండలం గవిచర్లలో కూడా మంత్రి ఉపాధి హామీ పథకాన్ని నీటి పారుదల శాఖకు అనుసంధానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం