తెలంగాణ

telangana

ETV Bharat / state

Errabelli: 'నా చేతులతో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది' - నర్సంపేటలో మార్కెట్​ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని అంగడి మైదానంలో నూతనంగా నిర్మించిన అధునాతన కూరగాయల మార్కెట్​ భవనాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పట్టణాన్నిఅన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు.

minister errabelli dayakar rao in narsampet
నర్సంపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

By

Published : May 29, 2021, 7:39 AM IST

సీఎం కేసీఆర్​, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సహకారంతో వరంగల్​ గ్రామీణ జిల్లాలోని నర్సంపేటను.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. పట్టణంలోని అంగడి మైదానంలో నూతనంగా నిర్మించిన అధునాతన కూరగాయల మార్కెట్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మరింత అభివృద్ధి చేస్తారని మంత్రి అన్నారు. రూ. రెండు కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులు తనను ఆశీర్వదించి ఇంతటి స్థాయికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రూరల్​ జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిని కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:FCI RICE: 'ఉప్పుడు బియ్యం వద్దు.. ముడి సరకు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details