తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రధాని తెలంగాణకు వచ్చే ముందు ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలి' - మోదీపై ఎర్రబెల్లి దయాకర్ విమర్శనాస్త్రాలు

Errabelli Comments on Modi Tour: ప్రధానిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపింది మోదీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చే ముందు రాష్ట్రానికి ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Errabelli dayakar rao
Errabelli dayakar rao

By

Published : Nov 10, 2022, 5:41 PM IST

Updated : Nov 10, 2022, 7:25 PM IST

Errabelli Comments on Modi Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు వచ్చే ముందు రాష్ట్రానికి ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఆపింది మోదీ కాదా అని ప్రశ్నించారు. ఏం మోహం పెట్టుకుని తెలంగాణకు రావాలనుకుంటున్నారని మోదీపై ఎర్రబెల్లి మండిపడ్డారు.

ప్రధానిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందని ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. మునుగోడు ఫలితంతో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెరాస ప్రభుత్వం పనితీరుకు కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారన్న ఎర్రబెల్లి దయాకర్​రావు... ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయని ప్రధాని... తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

'ప్రధాని తెలంగాణకు వచ్చే ముందు ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలి'

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details