సంక్షేమంలో తెలంగాణ ముందుందని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి రూ. 43లక్షల, 4వేల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
'పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్' - రాయపర్తిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.
'పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్'
కరోనా కష్ట కాలంలోనూ... సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి కొనియాడారు. కేంద్రం వ్యవసాయాన్ని దండగ చేసే పనిలో ఉందన్నారు. భారీ వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న, కూలి పోయిన బాధితులకు పరిహారాలను మంత్రి అందజేశారు.