వరంగల్ జిల్లా రాయపర్తిలో మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకుని, కోలాటం ఆడి సందడి చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కోలాటంలో పాల్గొని మహిళలతో కలసి ఆడి పాడారు. అనంతరం లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే. ప్రతి ఒక్కరికీ చీరలు అందేలా వారే చూడాలి. అవసరమైతే ఇంటింటికీ చీరలు పంపిణీ చేయాలి. అదే విధంగా రెండు పడక గదులు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. -ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి