తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ఎర్రబెల్లి.. వృద్ధురాలి కష్టాలు విని చలించి.. - కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి

Minister Errabelli: ఓ వృద్ధురాలి కష్టాలను చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చలించిపోయారు. ఆమె రోదనలు చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చి కంటనీరు కూడా పెట్టుకున్నారు. ప్రభుత్వపరంగా ఆమెకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా చూడాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి.. వృద్ధురాలి కష్టాలు విని చలించిన మంత్రి..
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి.. వృద్ధురాలి కష్టాలు విని చలించిన మంత్రి..

By

Published : May 14, 2022, 4:07 PM IST

Minister Errabelli: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఓ వృద్దురాలు తారసపడింది. కుటుంబ పరిస్థితులు మంత్రికి చెప్పి కంటనీరు పెట్టుకుంది. ఆ వృద్ధురాలి రోదనలు చూసిన మంత్రి ఎర్రబెల్లి చలించి పోయి దగ్గరకు తీసుకొని ఓదార్చి కంటనీరు పెట్టుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆమెకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక మంత్రి తన దగ్గరికి వచ్చి తన గోడు విని సహాయ పడతానని చెప్పడంతో ఆ వృద్ధురాలు కంట నీరు కారుస్తూ ఉప్పొంగి పోయి మంత్రి ఎర్రబెల్లిని ఆశీర్వదించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details