కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. దేశరాజధాని దిల్లీలో రైతులు నెలరోజులకుపైగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టనట్టుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి పర్యటించారు. కేశవాపురం, మురిపిరాల, కాట్రపల్లిలో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎర్రబెల్లి కొనియాడారు.
వరంగల్లో మంత్రి పర్యటన... అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వార్తలు
రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తప్పుపట్టారు. రాయపర్తి మండలంలో పర్యటించి... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు.
రైతువేదికలు, పల్లెప్రకృతి వనాలు ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి