పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు తమదేనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హరిత కాకతీయలో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో తెరాస శ్రేణులు బాగా కష్టపడ్డారని వారికి ధన్యవాదాలు తెలిపారు.
నెల్లికుదురులో భాజపాపై మేము దాడి చేయలేదు: ఎర్రబెల్లి - ఎమ్మెల్సీ 2021
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన అందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లికుదురులో భాజాపాపై తెరాస దాడి చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు విచారణ జరిపి నిందితులను గుర్తించి శిక్షించాలని సూచించారు.
నెల్లికుదురులో భాజపాపై మేము దాడి చేయలేదు: మంత్రి ఎర్రబెల్లి
పోలింగ్ ప్రశాంతంగా, ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. దీనికి సహకరించిన అన్ని పార్టీలకు చెందిన వారికి, అధికారులకు పోలీసులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లికుదురులో భాజపా వాళ్లే తెరాస కండువా కప్పుకుని తిరిగారని... వారిని తెరాస నేతలు అడ్డుకున్నారని తెలిపారు. తాము ఎవరిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు