ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో ఆయన పర్యటించారు. పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు.
కాస్త ఆలస్యమైనా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తాం: ఎర్రబెల్లి - warangal rural district news
కాస్త ఆలస్యమైనా రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి.. పేదలకు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు.
కాస్త ఆలస్యమైనా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తాం: ఎర్రబెల్లి
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్నారు. కాస్త ఆలస్యమైనా ప్రతీ నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించడమే తమ ప్రభుత్య లక్ష్యమని తెలిపారు.
ఇవీచూడండి:కొండెక్కిన సంక్రాంతి సరకులు.. 50%పైగా పెరిగిన ఖర్చు