తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టకాలంలోనూ పేదలకు అండగా తెరాస: మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తాజా వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని 126 మంది లబ్ధిదారులకు రూ. కోటి 24లక్షలు విలువచేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి ఎర్రబెల్లి అందించారు. పేదింటి ఆడ బిడ్డలకు సీఎం కేసిఆర్ పెద్దన్నగా కల్యాణ లక్ష్మి చెక్కులు అందించి వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు.

కష్టకాలంలోనూ పేదలకు అండగా తెరాస: మంత్రి ఎర్రబెల్లి
కష్టకాలంలోనూ పేదలకు అండగా తెరాస: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Sep 21, 2020, 8:43 PM IST

కరోనా కష్టకాలంలోనూ పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం తెరాస అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని 126 మంది లబ్ధిదారులకు రూ. కోటి 24లక్షలు విలువచేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి ఎర్రబెల్లి అందించారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు
పేదింటి ఆడ బిడ్డల పెళ్లికి కట్నంగా.. సీఎం కేసీఆర్ పెద్దన్నగా కల్యాణ లక్ష్మి చెక్కులు అందించి వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. సీఎం తీసుకుంటున్న చర్యల వల్ల త్వరలోనే కరోనా రహిత తెలంగాణను చూడబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి ఆశాభవం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details