వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు మంత్రులు, పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు. పరకాల నియోజకవర్గంలోని 16వ డివిజన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు.
సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి - minister errabelli dayakar rao campaign in warangal municipal elections
గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరందుకున్నాయి. పరకాల నియోజరవర్గంలోని 16వ డివిజన్లో మంత్రి దయాకర్ రావు పర్యటించారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
![సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి minister errabelli campaign in 16th division warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:35:59:1619244359-tg-wgl-16-24-minister-pracharam-av-ts10076-24042021112345-2404f-1619243625-561.jpg)
వరంగల్ 16వ డివిజన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం
సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నది ప్రజలు గుర్తించి... ప్రతి ఎన్నికల్లోనూ నిరూపిస్తున్నారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని విపక్ష నాయకులను నిలదీయాలని మంత్రి కోరారు. బల్దియా ఎన్నికల్లో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్షా 68వేల వాననీటి సంరక్షణ నిర్మాణాలు!