ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించాలని వరంగల్ గ్రామీణ జిల్లాలోని కరోనా బాధితులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మనోధైర్యాన్ని నింపారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి జిల్లాలో హోమ్ ఐసోలేషన్, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బారిన పడినవారితో మాట్లాడారు.
ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించండి: మంత్రి ఎర్రబెల్లి - కరోనా బాధితులతో మంత్రి సంభాషణ
వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా వైరస్ బారిన పడినవారితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్లో ఆత్మీయంగా మాట్లాడారు. సమయానికి మందులు వేసుకోవాలని.. వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించండి: మంత్రి ఎర్రబెల్లి
మహమ్మారిని జయించాలని ఆత్మీయంగా మాట్లాడారు. సమయానికి మందులు వేసుకొని వేడి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. అండగా ఉన్నామనే భరోసా వారికి కల్పించారు. స్వయంగా మంత్రి ఫోన్ చేసి క్షేమసమాచారం అడిగి తెలుసుకోవడం పట్ల మహమ్మారి బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల