మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదినం సందర్బంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు మంత్రి ఎర్రబెల్లికి పూల మాలలు, మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
'దయన్న.. ఎదురులేని నేతగా నిండునూరేళ్లు చల్లగుండు' - మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షల వెల్లువ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన నివాసంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షల వెల్లువ
కరోనా దృష్ట్యా మాస్కులు ధరించి అభిమాన నాయకునికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ప్రజా జీవితంలో ఎదురులేని నాయకునిలా నిలవాలని అభిమానులు ఆకాక్షించారు.
ఇవీ చూడండి:పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి