ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
'పంట విషయంలో రైతులు అధైర్యపడొద్దు' - minister errabelli visited rayaparthi
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్పల్లి, కిష్టాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
!['పంట విషయంలో రైతులు అధైర్యపడొద్దు' minister errabelli about grain purchase centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6872097-780-6872097-1587391477383.jpg)
రాయపర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు భౌతిక దూరం పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.