తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

గతంలో ఏ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రమే తమ సేవలు గుర్తించారని వరంగల్​ గ్రామీణ జిల్లా జడ్పీ వైస్​ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. మరింత ఉత్సాహంతో అందరూ కలసి పనిచేస్తామని వెల్లడించారు.

milk-anointing-to-kcr-photo-at-wranagal
వరంగల్​లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jun 16, 2021, 2:19 PM IST

సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అంగన్వాడీ కార్యకర్తలకు 30 శాతం గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రికి వరంగల్​ గ్రామీణ జిల్లా జడ్పీ వైస్​ఛైర్మన్​ ఆకుల శ్రీనివాస్​, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

గతంలో ఎవరూ కూడా ఈ తరహాలో ప్రజాప్రతినిధులకు గౌరవవేతనం ఇచ్చిన దాఖలాలు లేవని... కేసీఆర్​ మాత్రమే గౌరవవేతనం చెల్లించారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరింత ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తామన్నారు.

ఇదీ చూడండి:కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస, ఈటల వర్గాల మధ్య రసాభాస

ABOUT THE AUTHOR

...view details