వరంగల్ గ్రామీణ జిల్లాలో కొంతమంది అనాలోచిత చర్యల వల్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా కోసిన వరి పొలాల్లో గడ్డిని తగల బెట్టె క్రమంలో చుట్టుపక్కల పొలాలు గడ్డి వాములు, వృక్షాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దాంతో పరిసర గ్రామాల ప్రజలు పోలీసులు, ఫైర్ అధికారులకు తెలుపుతున్నారు.
అర్ధరాత్రి మంటలు.. భయాందోళనలో స్థానికులు
వరంగల్ గ్రామీణ జిల్లాలో పలువురు చేస్తున్న నిర్లక్ష్య పూరిత చర్యల వల్ల చిన్నమంట కాస్త పెద్దగా వ్యాపించి ఊర్ల వైపుకు ముంచుకొస్తుంది. అది కాస్తా ప్రమాదంగా సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొత్తగా కోసిన వరి పొలాల్లో గడ్డిని తగులబెట్టడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి వర్ధన్నపేట పరిధిలోని నీలగిరి స్వామి తండా సమీపంలో మంటలు ఎగిసిపడ్డాయి.
అర్ధరాత్రి మంటలు.. భయాందోళనలో స్థానికులు
తాజాగా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల పరిధిలో ఈ తంతు మొదలైంది. బుధవారం అర్ధరాత్రి వర్ధన్నపేట పట్టణ పరిధిలోని నీలగిరి స్వామి తండా సమీపంలో మంటలు ఎగసి పడుతూ అగ్ని కీలలు వ్యాపించాయి. వరి కోశాక పొలాల్లోని గడ్డిని కాల్చకూడదని పలుమార్లు వ్యవసాయ, పోలీసు అధికారులు చెప్పినా… పలువురు రైతులు మాత్రం వినడం లేదు.
ఇదీ చూడండి:గుట్టల్లో మూడు మృతదేహాలు... ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు