తెలంగాణ

telangana

ETV Bharat / state

'దానివల్లే ఎలుకల సమస్య.. చర్యలు తీసుకుంటాం'

MGM Superintendent : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు తెలిపారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి పడేయడం వల్లే ఐసీయూలో ఎలుకల బెడద ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

MGM Superintendent
MGM Superintendent

By

Published : Mar 31, 2022, 2:16 PM IST

MGM Superintendent : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాస్ అనే రోగి ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎంజీఎంకు వచ్చారని.. తీవ్ర అనారోగ్యంతో వస్తే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఎలుకల నివారణకు ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రోగి బంధువులు తీసుకొచ్చిన ఆహారపదార్థాలు పడేయడం వల్లే ఎలుకల బెడద ఉందని అన్నారు. ఆస్పత్రికి ఆనుకొని వంట గది ఉండటం కూడా ఈ సమస్యకు కారణమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వాహకులకు షోకాజు నోటీసులిచ్చినట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుతో ముఖాముఖి..

దానివల్లే ఎలుకల సమస్య.. చర్యలు తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details