మూడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ నగరంలో ఎంజీఎం కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది.. విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు.. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటూ.. ఆసుపత్రి గేటు ముందు బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే' - mgm employees
పని చేస్తున్నారు... కానీ జీతాలు మూడు నెలలుగా అందడం లేదు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే'
'వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతమే'
గతంలో ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని... అందుకే ధర్నాకు దిగామని ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి