వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆచార్య డిగ్రీకళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. కొవిడ్-19 కారణంగా రక్త నిల్వలు తగ్గిపోయాయని, రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
'రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి' - blood donation camp in warangal rural district
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి
మొత్తం 12 క్యాంపులను ఏర్పాటు చేసి 5వేల యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వానికి అందించనున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా ముందుకురావాలని యువతను కోరారు.
వరంగల్ గ్రామీణ జిల్లాకు సరిపడా రక్త నిల్వలున్నాయని, మిగతా జిల్లాల కోసం రక్తాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. శిబిరాల వద్ద భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.