లారీ డ్రైవర్లకు భోజన ప్యాకెట్లు పంపిణీ - Meal packets for lorry drivers at Wardhanpet
రాష్ట్రంలో నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్న వాహనదారులకు వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ అధికారులు సంయుక్తంగా భోజన ప్యాకెట్లను అందిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ అధికారులు వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులకు భోజన ప్యాకెట్లను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలా వారం రోజుల నుంచి వాహనదారులకు భోజనాలు సమకూరుస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవిందర్ తెలిపారు. నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులను సరఫరా చేసే వాహనాల డ్రైవర్లు, క్లీనర్లకు ఇలా భోజనం అందించడం సంతోషం కలిగిస్తోందని వారు తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఇలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.