వరంగల్ గ్రామీణ జిల్లా మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి... ఊరి ప్రజలకు టీకాపై అవగాహన కల్పించి... 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలందరికీ టీకా అందించాలని బాలిరెడ్డి భావించారు. ముందుగా ప్రజలకు టీకాపై అపోహలను తొలగించి... వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం చేపట్టారు.
సొంతఖర్చులతో గ్రామ ప్రజలందరికీ టీకా వేయించిన సర్పంచ్ - Mariyapuram sarpanch news
గ్రామమంటే ఆయనకు ఎనలేని అభిమానం గ్రామస్థులంతా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా సర్కారు ఇచ్చే నిధులతో పాటు తన సొంత డబ్బులను సైతం ఖర్చు చేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడటం ఆయన నైజం. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని అందరికీ టీకా వేయించాలని సంకల్పించారు. అనుకున్నది నెరవేర్చారు మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి.
ప్రజలందరికీ టీకా వేయించిన సర్పంచ్
మొదట 65 ఏళ్లుపైబడిన వారికి, తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి టీకా అందించారు. తన సొంతఖర్చులతో మండల కేంద్రం గీసుకొండకు వాహనాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. గ్రామంలో 45 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయించి... 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని బాలిరెడ్డి చెబుతున్నారు.
ఇదీ చూడండి:కరోనా బాధితులపై రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..?