ప్రాదేశిక ఎన్నికల్లో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ప్రచారం - pracharam
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. రాయపర్తి మండలంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఆయన నిర్వహించారు.
పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ప్రచారం
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని రాయపర్తి, మైలారం గ్రామాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వాటి అభివృద్ధికై తెరాస ప్రభుత్వం పాటు పడుతోందని ఎర్రబెల్లి అన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.