వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పోచారం, నడికుడలో పర్యటించారు. పోచారంలో దళితులకు ఇచ్చిన 20 ఎకరాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా.. పరకాల మున్సిపాలిటికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు భూములు ఇస్తామన్న తెరాస ప్రభుత్వం.. ఇలా వారి భూములు చెప్పకుండా తీసుకోవడం దారుణమని అన్నారు.
భూములు లాక్కోవడం దారుణం: మంద కృష్ణ - telangana news today
తెరాస ప్రభుత్వం దళితుల భూములు ఆక్రమించి చోద్యం చూస్తోందని ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. దళితులకు భూములు ఇవ్వకుండా.. ఉన్న భూములు లాక్కుంటోందని విమర్శించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని పోచారం, నడికుడలో ఆయన పర్యటించారు.
భూములు లాక్కోవడం దారుణం: మంద కృష్ణ
నడికుడలో దళితుల భూములు 525 సర్వే నంబర్లో ఉండగా.. ప్రభుత్వం ఆక్రమించి అదే సర్వే నెంబర్లో ఉన్న దళితేతరుల భూములకు పట్టాలు ఇచ్చి గౌరవించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పదించి దళితుల భూముల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి :బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్