వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. కార్మికులు, విద్యార్థి సంఘ నాయకులు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. పదమూడు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీకి ఎండీని నియమించాలన్న కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయలేదన్నారు. ఆర్టీసీకి ఎండీ ఉంటే సంస్థ ఆస్తులు అమ్ముకునేందుకు అడ్డువస్తాడనే నియమించడం లేదని ఆరోపించారు. ప్రజారవాణా సంస్థకు పన్ను మినహాయింపులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతున్నా.. తెలంగాణలో విలీనానికి అడ్డేంటన్నారు.
'ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు ఎండీని నియమించలేదు' - manda krishna madhiga protest at parakala
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మందకృష్ణమాదిగ ర్యాలీ చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు రవాణ సంస్థ ఆస్తులు అమ్ముకునేందుకే ఎండీని నియమించలేదని హెచ్చరించారు.
'ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు ఎండీని నియమించలేదు'