వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవటం వల్ల ప్రాణాపాయం తప్పింది. టిప్పర్ కూడా ఖాళీగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అదుపుతప్పి డివైడర్ ఎక్కిన లారీ... - ACCIDENT NEWS IN TELANGANA
అతివేగం కారణంగా ఓ టిప్పర్లారీ అదుపుతప్పి... ఏకంగా డివైడర్ ఎక్కింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్వ గాయాలతో బయటపడగా... ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
LORRY ACCIDENT IN PARAKALA DUE TO OVER SPEED
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాన్ని రోడ్డు మీద నుంచి తొలగించారు. ఈ క్రమంలో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రాణాపాయం జరిగే విధంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎన్ని సార్లు హెచ్చరించినా లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.