వరంగల్ గ్రామీణ జిల్లాలో లాక్డౌన్ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల పరిధిలో మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. సడలింపు సమయం తర్వాత రహదారులపైకి వస్తున్న వారిని హెచ్చరిస్తూ వాహనాలు జప్తు చేస్తున్నారు.
'చెప్పినా వినకపోతే.. చర్యలు తప్పడం లేదు'
వరంగల్ గ్రామీణ జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులను అనుమతిస్తూనే.. అనవసరంగా బయటకు వస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లాలో లాక్డౌన్, వరంగల్ గ్రామీణ జిల్లాలో వాహన తనిఖీలు
ఇప్పటికే వేల మందికిపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారని, తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించి లాక్డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు.