అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై వర్ధన్నపేట ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఆరోపించారు. కోనారెడ్డి చెరువు మరమ్మతులు మరిచి మద్యం పార్టీలు చేసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోనారెడ్డి చెరువు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆ అధికారులపై చర్యలు తీసుకోండి: అఖిలపక్షం - వర్ధన్నపేటలో ధర్నా చేపట్టిన అఖిలపక్షం
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వర్ధన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణ కేంద్రం మీదుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోని నిరసన వ్యక్తం చేశారు.

ఆ అధికారులపై చర్యలు తీసుకోండి: అఖిలపక్షం
రైతు వేదికల నిర్మాణం పనుల విషయమై అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి:'ఈ నెల 30న ఇందిరాభవన్లో పీవీ విదేశీ విధానంపై చర్చ'
TAGGED:
వర్ధన్నపేటలో అఖిలపక్షం నిరసన