తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం కోసం చిన్నారి దీప ఎదురుచూపులు - వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కామారం

వరంగల్​ జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి దీపను గౌడ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు పరామర్శించారు. కాలేయం, మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న బాలిక ఆపరేషన్​ కోసం 10లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పందించి ఖర్చును ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరారు.

Leader of the Gowda Intellectual Forum has child Deepa in Warangal district.
సాయం కోసం.. చిన్నారి దీప ఎదురుచూపులు

By

Published : Jun 17, 2020, 9:57 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి దీపకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని గౌడ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ జిల్లా కన్వీనర్ వేణుగోపాల్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన దీప.. పదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాలేయం, మూత్ర పిండాల వ్యాధితో దీప బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్​ కోసం దాదాపు 8 నుంచి 10లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు.

స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించి వెంటనే ఆపరేషన్ ఖర్చును ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని వేణుగోపాల్​ గౌడ్ కోరారు. ఈసందర్భంగా గౌడ ఇంటలెక్చువల్ ఫోరం తరపున రూ.15,000/- అందించారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ గౌడ్, జనగాం శ్రీనివాస్​గౌడ్, బూర నగేశ్​గౌడ్, పవన్ కుమార్​ గౌడ్, మూల ప్రవీణ్​ కుమార్, గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details