వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బంగారం లేదని, కేవలం తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎంచుకున్నామని కార్మిక నాయకులు అన్నారు.
కార్మిక నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన - Workers protest in front of RTC depot in Parakal town in Warangal rural district
నిన్న ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమ్మేళనంలో పోలీసులు కార్మికులపై చేసిన దమనకాండకు నిరసనగా పరకాల పట్టణంలోని బస్ డిపో ఎదురుగా నల్లబ్యాడ్జీలతో నాయకులు నిరసన చేశారు.
కార్మిక నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన
కార్మికులుగా పని చేసుకుని బతకడం తప్ప, మాకు విధ్వంసాలు చేయడం తెలియదని పేర్కొన్నారు. అలాంటి కార్మికులను పట్టుకుని పోలీసు శాఖ అవమానించి తమ గర్వాన్ని చాటుకున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు.
ఇదీ చూడండి : అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం