ఇద్దరు ఎంపీలతో దిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్కు 16 సీట్లను గెలిస్తే బయ్యారం ఉక్కుపరిశ్రమ వస్తదని కేటీఆర్ పేర్కొన్నారు. నర్సంపేటలో మాలోత్ కవితకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. దేశంలో బడితె ఉన్నోడిదే బర్రె అనే పరిస్థితి ఉందన్నారు. మోదీ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. భాజపాకు 160, కాంగ్రెస్‌కు 100 సీట్లకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. తెరాసకు 16 ఎంపీలు ఉంటే కేంద్రంలో చక్రం తిప్పుతామని అన్నారు.
దేశంలో బడితె ఉన్నోడిదే బర్రె : కేటీఆర్ - trs
'తెరాస అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరంటున్నారు. 16 లోక్సభ సీట్లను గెలిస్తే... దిల్లీలో మనమాటే చెల్లుబాటు అవుతుంది': కేటీఆర్
![దేశంలో బడితె ఉన్నోడిదే బర్రె : కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2850884-726-3fb27e02-90e8-4594-9cc7-15622c22d90b.jpg)
ktr
Last Updated : Mar 30, 2019, 7:50 PM IST