తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్షకభటులు.. హరిత సేవకులు..! - వరంగల్ రూరల్ జిల్లా

నక్సల్స్‌ ప్రభావం బాగా ఉన్న సమయంలో పోలీస్​స్టేషన్ల వైపు కన్నెత్తిచూసేందుకు సామాన్యులెవరూ సాహసం చేసేవారు కాదు. అయితే క్రమేపీ నక్సల్స్‌ ప్రభావం తగ్గడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా కొత్తగూడ పోలీసుస్టేషన్‌లో మొక్కలు నాటి హరితహారాన్ని పెంచుతున్నారు.

రక్షకభటులు..హరిత సేవకులు..!

By

Published : Aug 12, 2019, 9:10 PM IST

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలీస్​స్టేషన్ల పరిస్థితి మిగతావాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు అనువుగా పోలీస్‌స్టేషన్లను తీర్చిదిద్దుతున్నారు. కొత్తగూడ పోలీసుస్టేషన్‌ ఈ విషయంలో హరితప్రియుల మన్ననలు అందుకుంటోంది. హరితహారం స్ఫూర్తిని చక్కగా అందిపుచ్చుకున్న పోలీసు సిబ్బంది ఈ మేరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పోలీసు స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే పచ్చని చెట్లు ఆహ్వానం పలుకుతున్నాయి.

అన్ని రకాల మొక్కలు
వరంగల్ రూరల్ జిల్లా కొత్తగూడ పోలీసుస్టేషన్‌ నూతన భవనాన్ని 2017లో రూ.1.30కోట్లతో నిర్మించారు. ఇదే ఏడాది మే నెలలో అప్పటి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌ అందంగా కనిపించేలా అప్పటి ఎస్‌ఐ సతీశ్‌ ఆవరణలో పచ్చదనం నిండేలా మొక్కలు నాటించారు. పోలీస్‌స్టేషన్‌ భవనం చుట్టూ ఖాళీ స్థలంలో పూలమొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను నాటించారు. అలా నాటిన మొక్కలన్నీ ఇప్పుడు ఏపుగా పెరిగి స్టేషనంతా పచ్చదనం ఆవరించింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, ఇతరులు ఇక్కడి వాతావరణాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. పోలీసుస్టేషన్‌ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని కొత్తగూడ ఎస్‌ఐ తాహెర్‌బాబా తెలిపారు.

ఇదీ చూడండి : కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details