హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. ఓవైపు అధికార తెరాస.. మరోవైపు భాజపా తమ అభ్యర్థులతో దీటుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ.. కొండా సురేఖ(Konda surekha) కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. దీనిపై అధిష్ఠానం ఇంతవరకు స్పందించలేదు.
Konda surekha : హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీపై కొండా సురేఖ క్లారిటీ - konda surekha clarity about huzurabad constituency by election
రాష్ట్రంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార తెరాస.. ప్రతిపక్ష భాజపాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ(Konda surekha) బరిలో నిలుస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా లక్ష్మీపురం దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొన్న కొండా దంపతులు ఈ పుకార్లకు తెరదించారు.
మరోవైపు.. వరంగల్ జిల్లా లక్ష్మీపురంలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కొండా సురేఖ(Konda surekha) దంపతులు హాజరయ్యారు. ఈ సభలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లపై ఆమె స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని.. ఈ విషయమై అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. చర్చ జరిగింది మాత్రం వాస్తవమని చెప్పారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ(Konda surekha) తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాన్ని.. ముందే పసిగట్టి పార్టీ నుంచి బయటకు వచ్చామని తెలిపారు.