వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఉన్న కోనారెడ్డి చెరువు 14 సంవత్సరాల తర్వాత పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో ఆరు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు అలుగుపారుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. అటు గూడూరు నుంచి అన్ని చెరువులు, కుంటలు మత్తడి పడడంతో వాటి నీరు కోనారెడ్డి చెరువులోకి చేరడంతో పాటు, కట్టు కాలువ నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల చెరువు నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది.
14ఏళ్ల తర్వాత పరవళ్లు తొక్కుతోన్న కోనారెడ్డి చెరువు
14 ఏళ్ల తర్వాత పరవళ్లు తొక్కుతోంది వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. కాకతీయుల నాటి పురాతన చెరువు చాలాకాలం తర్వాత మత్తడి దూకడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. చేపలవేటకు స్థానికులు పోటీపడుతున్నారు.
14ఏళ్ల తర్వాత పరవళ్లు తొక్కుతోన్న కోనారెడ్డి చెరువు
దీంతో రైతులు, మత్స్యకారులు సంబుర పడుతున్నారు. చేపలవేటకు వెళ్లి పోటాపోటీగా చేపలను పడుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చెరువు మత్తడి పోయడం సంతోషంగా ఉందని... ఈ సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. పురాతన కాకతీయుల చెరువు కావడం వల్ల సుందర సోయగాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఇవీ చూడండి: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదప్రవాహం