వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. హోలీ రోజున స్వామివారికి శకట మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ప్రభ బండ్లతో జాతరకు తరలివచ్చారు.
సందడిగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర - ఘనంగా కొమ్మల లక్ష్మీనరసింహస్వామి జాతర
ఎడ్ల బండ్లు, మేకపోతుల బండ్లు, చక్రం బండ్లతో కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి శకట మహోత్సవం కోలాహలంగా జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
KOMMALA LAXMI NARASIMHA SWAMY FESTIVAL
తెరాస, కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన జెండాలతో ప్రభ బండ్లను తిప్పారు. ఎడ్ల బండ్లు, మేకపోతుల బండ్లు, చక్రం బండ్లను గుట్ట చుట్టూ తిప్పి స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాద్యాలు, నృత్యాలు చేసుకుంటూ గుట్టకు రావటం వల్ల జాతరలో సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి:ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు
TAGGED:
DEVOTIONAL NEWS IN TELUGU