తెలంగాణ

telangana

ETV Bharat / state

కొమ్మాలలో కన్నుల పండువలా శకట మహోత్సవం - వరంగల్​ గ్రామీణ జిల్లా తాజా వార్తలు

ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. హోలీ పండుగ రోజున శకట మహోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది.

kommala lakshmi narsimha swamy jathara
Kommala jathara, geesukonda jathara, kommala jathara

By

Published : Mar 29, 2021, 2:51 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా శకట మహోత్సవం వైభవంగా జరుగుతోంది. వ్యక్తిగత ప్రభ బండ్లతో భక్తులు జాతరకు వచ్చి గుట్ట చుట్టూ ప్రదర్శన చేసి మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చక్రం పండ్లు, మేకపోతుల బండ్లు, ఏనుగుల శకటాలు, గుర్రం బండి ఏర్పాటు చేసుకుని జాతరలో తిప్పుకొని వెళ్తున్నారు. రైతులు ఎద్దుల బండ్లతో వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఏడాదికోసారి వైభవంగా నిర్వహించుకునే ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ది ఎత్తున భక్తులు వస్తున్నారు.

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ..

జాతరలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని సూచించారు. క్యూలైన్ల వద్ద హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారి చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో రావడం వల్ల ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయారు. భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కన్నుల పండువలా శకట మహోత్సవం

ఇదీ చూడండి:హోలీ వేడుకల్లో మునిగితేలుతున్న జనం

ABOUT THE AUTHOR

...view details