తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలను విక్రయిస్తే వేటు తప్పదు - kharif-traning-to-input-dealers

ఖరీఫ్ సీజన్​లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డివిజన్​లోని విత్తనాల దుకాణంల్లో నకిలీల విక్రయం జరగకుండా నిత్యం అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నకిలీ విత్తనాలను విక్రయిస్తే వేటు తప్పదు

By

Published : May 20, 2019, 8:32 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో విత్తనాల విక్రయ డీలర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విత్తనాలు విక్రయించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ అనుమతి ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి డీలర్ రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. వాటిని రైతులు పంటకాలం పూర్తయ్యేంతవరకు దాచుకోవాలన్నారు. విత్తన విక్రయదారులు వ్యవసాయశాఖ నియమ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలను విక్రయిస్తే వేటు తప్పదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details