లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు సహకరించాలని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఎర్రబెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందిగా మారిందన్నారు. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే కరోనా ఇబ్బందికరంగా మారిందన్నారు.
సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటుంది !