వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది. పవిత్ర కార్తిక సోమవారం రోజున భక్తులు పిండి దీపాలు వెలిగించి... శివుని కటాక్షం కోసం బారులు తీరారు. ఆలయంలో శతలింగ అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాలయ ఆవరణమంతా దీపాలతో కళకళలాడింది.
మిరిమిట్లు గొలుపుతున్న కుంకుమేశ్వరస్వామి ఆలయం