వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు భరోసాగా కల్పించారన్నారు.
'పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి ఉండగా' - ఖిలా వరంగల్లో కల్యాణ చెక్కుల పంపిణీ
పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం ఇచ్చిన వరం కల్యాణలక్ష్మి పథకమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఖిలావరంగల్లోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు.
'పేదింటి ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి ఉండగా'
మహిళల సంరక్షణ కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ బిల్లా శ్రీకాంత్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ సోల్తీ భూమత-రామస్వామి నాయకులు, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం