మహిళా సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పరకాలలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పరకాలలో చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా
రైతులకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఒక కోటి 23 లక్షలకుపైగా విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
పరకాలలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 124 లబ్ధిదారులకు రూ. 1,23,65,268 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులు అందచేశారు. రైతులకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు