వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలానికి చెందిన 147 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. కోటి 46 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
147 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - పరకాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన 147 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని 'బంగారు తెలంగాణ'గా మార్చేందుకు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
![147 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ mla challa distributed shaadi mubarak cheque at parakala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8762527-931-8762527-1599816906262.jpg)
147 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
దశాబ్దాల కాలంగా బూజుపట్టిన రెవెన్యూ చట్టాన్ని అధునికీకరించి.. కొత్త చట్టానికి శ్రీకారం చుట్టిన ఘటన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే చల్లా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం ముఖ్యమంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 'బంగారు తెలంగాణ'గా మార్చేందుకు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ధర్మారెడ్డి అన్నారు.
ఇదీ చదవండిఃకేటీఆర్కు రూ. 1.23 కోట్ల చెక్కు అందజేసిన ఎంపీ నామ