కరోనాపై పోరుకు ప్రభుత్వానికి పలువురు విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ స్టోన్ క్రషర్స్ సంక్షేమ సంఘం రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో అందజేశారు.
కాకతీయ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం - కరోనాపై పోరుకు ప్రభుత్వానికి విరాళాలు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా పలువురు దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు.
![కాకతీయ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం kakatiya strone crushes owners association](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6976178-235-6976178-1588075484826.jpg)
కాకతీయ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం
లాక్డౌన్ సమయంలో దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కష్టాల్లో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.