మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభమవుతుండగా శిథిలావస్థకు చేరుకున్న బడులపై అధికారులు దృష్టిసారించడం లేదు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని 46 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 12 జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 4,715 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. వీటిలో తీర్మాలయపల్లి, తట్టకుంట తండా, కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నాయి. బాలాజీ తండా, రాయపర్తి, కొండాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలు మరమ్మతులు కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
వేసవి సెలవుల్లోనైనా మరమ్మతులు చేస్తారనుకున్నా అధికారులు ఆ ఊసే ఎత్తలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా తమ పిల్లలు అవస్థలకు గురి కావాల్సిందేనా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శిథిలావస్థలో సర్కారు పాఠశాలలు
మరో రెండు వారాల్లో పాఠశాలలు పున:ప్రారంభు కానున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పలు పాఠశాలలు మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనూ శిథిల బడులకు పిల్లల్ని పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
సర్కారు బడుల్లో అవస్థలు.. శిథిలాల మధ్య చదువులు
ఇవీ చూడండి: మా భూములు వేరే పేర్ల మీద ఎలా వస్తాయి..?