వరస చోరీలకు పాల్పడుతునన అంతరాష్ట్ర దొంగల ముఠాను వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గుజరాత్‌కు చెందిన ముగ్గురు సభ్యులు దొంగతనాలు చేస్తున్నట్టు జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అంతరాష్ట్ర దొంగల మూఠా అరెస్టు - వరంగల్ గ్రామీణ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల అరెస్టు
గుజరాత్ చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో వరస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు డీసీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు వివరించారు.
అంతరాష్ట్ర దొంగల మూఠా అరెస్టు
నిందితుల నుంచి 16 వేల నగదు, కారు, ద్విచక్రవాహనం, నాలుగు చరవాణీలు, కత్తి స్వాధీనం చేస్తున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఐదుగురు సభ్యులు ఉండగా ముగ్గురిని పట్టుకున్నట్టు వివరించారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.