వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో అధికారులు దాడులు నిత్యకృత్యమైనా... అక్రమ నాటుసారా తయారీ మాత్రం ఆగటం లేదు. తండాలే కాకుండా గ్రామాలు, మండలకేంద్రాల్లో సైతం స్థావరాలు ఏర్పరుచుకుని నాటుసారా ఏరులై పారిస్తున్నారు.
60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత - wardhannapet news
వరంగల్ గ్రామీణ జిల్లాలోని సంగెం, వర్ధన్నపేటలో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టుబడింది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత
తాజాగా సంగెం, వర్ధన్నపేట పరిధిలో జరిగిన ఆబ్కారీ శాఖ అధికారుల దాడుల్లో 60లీటర్ల నాటుసారా, 180కిలోల బెల్లం పట్టుబడగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు నాటుసారాను పూర్తిస్థాయిలో నిర్ములించాలని ప్రజలను కోరుతున్నారు.