కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అండగా నిలిచారు వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన యువకులు. తమ పాకెట్ మనీకి తోడుగా ఇంట్లో మరికొంత డబ్బ తీసుకొని గ్రామంలోని నిరుపేదలకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే పాలు, గుడ్లు, బియ్యం అందజేశారు.
పాకెట్ మనీతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - పాకెట్ మనీతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి, వృద్ధులకు, నిత్యావసర సరుకులు అందజేస్తూ అండగా నిలుస్తున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లంద గ్రామ యువకులు.
పాకెట్ మనీతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఈ కార్యక్రమానికి పోలీసులను కూడా ఆహ్వానించి వారి చేతుల మీదుగానే పంపిణీ చేయించారు. ఈ యువకులను ఆదర్శంగా తీసుకని ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు అండగా నిలవాలని పోలీసులు సూచించారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ... ఆదుకున్న వారికి అండగా...