వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్ ఫలితాల విడుదలను పరిశోధక విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి సాయన్నతో వాగ్వాదానికి దిగారు. పరిశోధక ప్రవేశ ఫీజులను తగ్గించాలని విద్యార్థులంతా పాపిరెడ్డితో గొడవపడ్డారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో లేని ఫీజును కాకతీయ విషయంలోనే అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సముదాయించి బయటకు పంపించారు. అనంతరం ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు.
'ఐసెట్ ఫలితాల విడుదలలో గందరగోళం' - STUDENTS
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్ ఫలితాలు విడుదల చేస్తుండగా... విద్యార్థులు అడ్డుకున్నారు. పరిశోధక ప్రవేశ ఫీజులను తగ్గించాలని విద్యార్థులంతా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డితో వాగ్వాదానికి దిగారు.
'ఐసెట్ ఫలితాల విడుదలకు కాస్త గందరగోళం'