వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కోసం రేషన్ దుకాణాలకు పోటెత్తారు. కొరత ఏర్పడుతుందేమోననే భయంతో కేంద్రాల వద్ద బారులు తీరారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో సంచులు, చెప్పులు వరుసలో పెట్టి రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సన్నబియ్యం నిల్వలు అయిపోతే దొడ్డు బియ్యం ఇస్తారనే భయంతో నిబంధనలు పాటించకుండా రేషన్ షాపుల వద్ద ఎగబడుతున్నారు.
రేషన్ దుకాణాల్లో తోపులాట.. నిబంధనలు బేఖాతరు - తెలంగాణ వార్తలు
రేషన్ దుకాణాల్లో జనం బారులు తీరారు. సన్నబియ్యం అయిపోతాయనే ఉద్దేశంతో పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.
ఉచిత రేషన్, రేషన్ దుకాణాలు
విడతల వారిగా రేషన్ కేంద్రాలకు బియ్యం అందించడంతో పంపిణీ కష్టంగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు.
ఇదీ చదవండి:Rape: కదిలే బస్సులో బాలికపై అత్యాచారం!